Tuesday, July 21, 2026

పదవి బాధ్యతలు స్వీకరించిన మండల డెవలప్మెంట్ ఆఫీసర్ కు సన్మానం

ములుగు, మార్చి 5 (పిసిడబ్ల్యూ న్యూస్): గోవిందరావుపేట మండల కేంద్రంలోని ఎంపిడివో కార్యాలయంలో బదిలీ పై వచ్చి నూతనంగా పదవి భాద్యతలు చేపట్టిన గార్లపాటి జవహర్ రెడ్డి నీ ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి గనపాక సుధాకర్ మర్యాద పూర్వకంగా కలిసి శాల్వతో సత్కరించారు. ఈసందర్బంగా సుధాకర్ మాట్లాడుతు తెలంగాణ రాష్టంలో కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న ప్రజా సంక్షేమంలో భాగంగా సిఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన నిర్వహిస్తున్నారు. ఆర్థికంగా వెనుకబడిన ప్రజల అభివృద్ధి కోసం చేపడుతున్న సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు చేరేందుకు ప్రభుత్వ అధికారులు కృషి చేయాలని వారిని కోరారు. అంతే కాకుండా ప్రజా సమస్యలు తీర్చుటకు అందుబాటులో ఉండాలని ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని వారు కోరారు. ఈకార్యక్రమంలో జిల్లా బిసీ సెల్ ప్రధాన కార్యదర్శి కాసార్ల రాంబాబు చల్వాయి గ్రామ కమిటీ కార్యదర్శి కందాల వెంకన్న సీనియర్ నాయకులు చుక్క కొమురయ్య మహిళా కమిటీ నాయకురాలు గోపిదాస్ వజ్రమ్మ ఎండీ మజిత ఎండీ సజనా తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Latest Articles