కురవి, ఫిబ్రవరి27(పిసిడబ్లూ న్యూస్): మహబూబాబాద్ జిల్లా కురవి నుండి ఖమ్మం వెళ్ళే దారిలో కురవి గురుకులం దగ్గర రోడ్డు పక్కన ప్రమాద కరంగా ఉన్న బావిని వెంటనే పూడ్చి వేయాలని కురవి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు మిర్యాల లచ్చయ్య ఎమ్మెల్యే డాక్టర్ రాంచంద్రునాయక్ ను కోరారు..ఆ బావి కురవి మాజీ సర్పంచ్ నూతక్కి నర్సింహరావు కు చెందినదని ఆ బావిలో ప్రమాదవశాత్తు పడి ఇప్పటి వరకు పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారని లచ్చయ్య మహాశివరాత్రి జాతర సమీక్ష లో ఎమ్మెల్యే దృష్టి కి తీసుకెళ్ళడం తో స్పందించిన ఎమ్మెల్యే డాక్టర్ రాంచంద్రునాయక్ సంబంధిత అధికారులను పిలిచి ఆ బావిని పూడ్చే విధంగా యజమాని తో మాట్లాడాలని కోరారు…. వేరే చోట బావి తీసుకునే విధంగా యజమాని కి నష్ట పరిహారం చెల్లించాలని అధికారులను ఎమ్మెల్యే అదేశించారు.
[td_block_social_counter facebook="#" twitter="#" youtube="#" style="style8 td-social-boxed td-social-font-icons" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM4IiwiZGlzcGxheSI6IiJ9LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" custom_title="Stay Connected" block_template_id="td_block_template_8" f_header_font_family="712" f_header_font_transform="uppercase" f_header_font_weight="500" f_header_font_size="17" border_color="#dd3333" manual_count_twitter="85687" manual_count_youtube="66686" manual_count_facebook="87567"]