అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదు
నడికూడ, ఫిబ్రవరి21 (పిసిడబ్ల్యూ న్యూస్): గత పది సంవత్సరాలుగా కష్టపడి పని చేస్తుంటే కాంగ్రెస్ నాయకులు గ్రామపంచాయతీ, మహిళా భవనం చూసి చేసిన ఆరోపణలపై తీవ్రంగా ఖండిస్తున్నాం. గత మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మా నడికూడ గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేసి ఆ మండలాన్ని చేసి రూపురేఖలు మార్చిన ఘనుడు అభివృద్ధి ప్రదాత మండల కేంద్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లారు. అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవాళ వాడవాడకు బురదమైన రోడ్లను అప్పుడున్న ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సహకారంతో వాడవాడకు సిసి రోడ్లు వేసుకోవడం జరిగింది. ఇయాల 14 గ్రామపంచాయతీ రాకపోకలు ఇబ్బంది అవుతుందని పరిస్థితిలో డబుల్ రోడ్డు నిర్మాణం చేసుకోవడం జరిగింది. తెలంగాణ గవర్నమెంట్ మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ఆశీస్సులతో పల్లె గ్రామాలే ఆ అభివృద్ధి చెందుతూనే దేశానికి పట్టుకొమ్మలు అనే ఉద్దేశంతో ఇవాళ సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతి నిధులు ఇచ్చుకుంటూ, ఇచ్చిన నిధులను విలేజ్ కి ట్రాక్టర్ తీసుకోవడం జరిగింది ఇయాల వీధి దీపాల కోసం ఐమాక్స్ లైట్స్ పెట్టుకోవడం జరిగింది. ఇవాళ స్మశాన వాటిక గాని డంపింగ్ యార్డ్ గాని రైతుల కోసం రైతు వేదిక నిర్మించుకోవడం జరిగింది. ఎలా కేసీఆర్ విద్యను అభివృద్ధి చేయాలని ఆలోచనతో మన ఊరు మనబడి ఏర్పాటు చేసుకోవడం జరిగింది మహిళల కోసం మహిళా భవనం, నడికూడ గ్రామపంచాయతీ శిథిల వ్యవస్థలు ఉంటే గ్రామపంచాయతీ నిర్మించుకోవడం జరిగింది ఇవాళ రోజున ఇన్ని అభివృద్ధి పనులు చేస్తే ఎలా కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ సర్పంచ్ అవార్డు ఎందుకు ఇచ్చారో కాంగ్రెస్ నాయకులకు తెలియదా..ఇదంతా తెలిసే చేస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు ఇదంతా గ్రామస్తులు గమనిస్తున్నారని తెలుసుకోవాలి. ఇవాళ మాజీ ఎమ్మెల్యే సహకారంతో ఎమ్మెల్యే సహకారంతో ఎలా కలిసికట్టుగా పాలక గ్రామపంచాయతీ పాలకవర్గంలో గాని ఇలా మాతోటి బిఆర్ఎస్ పార్టీ నాయకులు గాని ఇలా అభివృద్ధికి ఇంతకుముందున్న కాంగ్రెస్ నాయకులు చేసిన అభివృద్ధికి సహకరించుకుంటూ ఎలా నాయకులు అప్పుడు మాట్లాడని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇప్పుడు మాట్లాడుతున్న ఇలాంటి ఉండి మాట్లాడిన నాయకులు ఎవరో మాకు తెలుసు ఎలా నాయకులు చేసిన వాళ్లే వాళ్లకు ఇల్లు స్థలాల కోసం వల్ల వారితోపాటు, ఎమ్మార్వో ఆఫీస్ పక్క స్థలమైన గవర్నమెంట్ ల్యాండ్ పట్టా చేసుకొని ఎలా పోలీసులు పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామంటే ఆ విషయంలో పార్టీ మారడం జరిగింది. అటువంటి నాయకులు వంకర బుద్ధితో స్వార్థ రాజకీయాలతో, అందితే జుట్టు లేదంటే కాళ్లు పట్టుకోవడం చేస్తూ,ఇయాల మాట్లాడుతున్నారంటే మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీలో ఇవాళ నడికూడ లో ఏ టీం బీ టీములుగా ఏర్పడి ఇవాళ అభివృద్ధికి అడ్డుపడాలనే ఉద్దేశంతో మా మా మీద బురదజల్లే ప్రయత్నం చేస్తూ, అసత్య ఆరోపణలు చేస్తున్నారు. మీరు మొగోళ్ళు అయితే ఇప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే తోని మిగిలిపోయిన పనులుచేసి మీరు మెప్పు పొందాలే తప్ప ఇటువంటి తప్పుడు ఆలోచన తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదని బిఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు నారగాని శ్రీనివాస్,బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నెవరు గొమ్ముల ప్రభాకర్ రావు,ఊర సతీష్ రావు,కిన్నెర మని, కొక్కిరాల దేవేందర్రావు,బిఆర్ఎస్ నాయకులు గ్రామ పార్టీ కార్యదర్శి రావుల కిషన్, సంఘాన్ని వేణు,గొడిశాల రంజిత్,దుప్పటి మొగిలి అన్నారు.