బిఎస్పీ హనుమకొండ జిల్లా అధ్యక్షులుగా ఎల్తూరి శ్రీనివాస్ పదోన్నతి..
హనుమకొండ, ఫిబ్రవరి 5 (పిసిడబ్ల్యూ న్యూస్): బహుజన్ సమాజ్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షులుగా పరకాల పట్టణానికి చెందిన ఎల్తూరి శ్రీనివాస్ గారిని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపిఎస్ నిన్న జరిగిన తెలంగాణ రాష్ట్ర ఈసీ సమావేశంలో నేషనల్ కోఆర్డినేటర్ రాజ్యసభ ఎంపీ రాంజీ గౌతమ్ ముఖ్య అతిథిగా హాజరై పలు నిర్ణయాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర బహుజన సమాజ్ పార్టీ ముందుకు సాగేందుకు రాబోయే అన్ని రాజకీయ సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని వివిధ జిల్లాల రాష్ట్ర కమిటీలో జిల్లా కమిటీలు రాష్ట్ర కమిటీ మార్పులు పదోన్నతులు చేయడం జరిగింది. ఈరోజు ఉదయం బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ పలువురికి పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు దానిలో భాగంగా హనుమకొండ జిల్లా బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షులుగా పరకాల పట్టణానికి చెందిన ఎల్తూరి శ్రీనివాస్ జిల్లా అధ్యక్షులుగా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.పరకాల అసెం నియోజకవర్గ అధ్యక్షులుగా పనిచేస్తున్న ఎల్తూరి శ్రీనివాస్ గత కొద్ది సంవత్సరాలుగా స్వేరో ఇంటర్నేషనల్ స్వేరో పనిచేస్తూ అనేక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ bsp లో చేరిన తర్వాత బహుజన సమాజ్ పార్టీలో చేరి గ్రామస్థాయి నుండి అసెంబ్లీ అధ్యక్షులుగా పనిచేస్తున్న క్రమంలో హనుమకొండ జిల్లా అధ్యక్షులుగా ఎల్తూరి శ్రీనివాస్ ని నియమించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ బిఎస్పీ పరకాల అసెంబ్లీ ఉపాధ్యక్షులు ఎండి అంజాద్ పాషా పరకాల మండల అధ్యక్షులు పెండెల మహేందర్ నడికొండ మండల అధ్యక్షులు శనిగరపు వెంకటేష్ దామెర మండల అధ్యక్షులు ముత్యాల నరేందర్ ఆత్మకూరు మండలం కన్వీనర్ ఆర్షం మధుసూదన్ సంగెం మండల నాయకులు పరకాల శ్రీకాంత్ గుండేటి మధు దామెర రాజేందర్ గీసుకొండ మండల నాయకులు టీ .శివశంకర్ తదితరుల హర్ష వ్యక్తం చేశారు.బహుజన సమాజ్ పార్టీ అభివృద్ధికి నిరంతరం పనిచేస్తామని నూతనంగా ఎన్నికైన జిల్లా అధ్యక్షులు ఎల్తూరి శ్రీనివాస్ తెలియజేశారు.