Saturday, March 7, 2026

సదరం సర్టిఫికెట్ కొత్త, రెన్యూవల్ కోసం మీ సేవ కార్యాలయంలో అప్లై చేసుకోండి..

భూపాలపల్లి: జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సదరం సర్టిఫికెట్ కొత్త, రెన్యువల్ కోసం దరఖాస్తు చేయదలుచుకున్న వారు మీసేవ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని, అట్టి దరఖాస్తు ను మాత్రమే సదరం క్యాంపునకు అర్హత కలిగిన వాటిగా గుర్తించి, సంబంధిత డాక్టర్ పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహించబడతాయని, ఈ క్రింది తేదీలలో మీ సేవలో స్లాట్ బుకింగ్ చేసుకున్న వారికే క్యాంపు(ప్రభుత్వ హస్పటల్-భూపాల్ పల్లి) లో నిర్వహించబడుతుందని, ఈనెల 24వ తేదీ వరకు అప్లై చేసుకోవాలని, పైన తెలిపిన తేదీలో ఎముకలు, చెవిటి, మూగ క్యాంపులు నిర్వహించబడతాయని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

Related Articles

Latest Articles