డిటిడిఓ ఆఫీస్ ముందు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా..
మహబూబాబాద్ జిల్లా/పిసి డబ్ల్యు న్యూస్: మహబూబాబాద్ జిల్లాలో ముత్యాలమ్మ గుడి ఆశ్రమ పాఠశాలలో విద్యార్థిని పై చేయి చేసుకున్న తెలుగు పండిట్ సస్పెండ్ చేయాలంటూ విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన హెచ్ఎం సస్పెండ్ చేయాలన్నీ ధర్నా నిర్వహించారు. అనంతరం డిటిడిఓ వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి సాయి కుమార్,పి డి ఎస్ యూ జిల్లా కన్వీనర్ దేవేందర్,ఎల్ ఎస్ ఓ జిల్లా అధ్యక్షులు శివ వర్మ,
ఎస్ ఎఫ్ ఐ మహబూబాబాద్ డివిజన్ కార్యదర్శి సూర్యప్రకాష్,జిల్లా నాయకులు సింహాద్రి,నితిన్,విజయ్,వినోద్,ప్రవీణ్ నవీన్ తదితరులు పాల్గొన్నారు.