జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో నీ ప్రయాణ ప్రాంగణం స్థలాన్ని కొంతమంది అక్రమించుకోవాలని చూడగా, విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే శ్రీధర్ బాబు బస్ స్టేషన్ ను సందర్శించి ఆర్టీసీ డి ఎం శ్రీనివాస్ తో మరియు ఎస్సై శ్రీనివాస్ తో మాట్లాడుతూ,ప్రజలకు చెందిన ఆర్టీసీ స్థలం కబ్జాకు గురి కాకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు బస్ స్టేషన్ పరిరక్షణకు కృషి చేయాలని అన్నారు. ఎంపీపీ పంథకాని సమ్మయ్య,కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, వైస్ ఎంపీపీ తిరుమల తిరుపతి రెడ్డి ,సర్పంచులు ఫోరం అధ్యక్షుడు దేవేందర్ రెడ్డి ఎంపీటీసీ మహేశ్వరి,సర్పంచులు రఘు రామ్ ,అశోక్,నాయకులు విక్రమ్ సుగుణ,రమేష్ రెడ్డి , ఓం సింగ్,నరేష్,మల్లారెడ్డి,శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
[td_block_social_counter facebook="#" twitter="#" youtube="#" style="style8 td-social-boxed td-social-font-icons" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM4IiwiZGlzcGxheSI6IiJ9LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" custom_title="Stay Connected" block_template_id="td_block_template_8" f_header_font_family="712" f_header_font_transform="uppercase" f_header_font_weight="500" f_header_font_size="17" border_color="#dd3333" manual_count_twitter="85687" manual_count_youtube="66686" manual_count_facebook="87567"]