నడికుడ, అక్టోబర్ 14 (పీసీడబ్ల్యూ న్యూస్): నడికుడ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికపై వివాదం నెలకొంది. మొదటి విడతలో సుమారు 60 మందికి, రెండో జాబితాలో మరో 20 మందికి అవకాశం కల్పించారు. అయితే రెండో జాబితాలో ప్రభుత్వ ఉద్యోగుల పేర్లు, ఇప్పటికే పక్కా భవనాలు ఉన్నవారి పేర్లు ఉన్నాయని బాధితులు ఆరోపిస్తున్నారు. నిజమైన పేదలకు ఇళ్లు అందకుండా అనర్హులకు ఎలా ఎంపిక చేశారని ప్రశ్నిస్తున్నారు. సంబంధిత అధికారులు జాబితాను పునఃపరిశీలించి, అర్హులకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
