Thursday, October 15, 2026

ఎన్నడూ లేని విధంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించాలి: ఎమ్మెల్యే రేవూరి

పరకాల, అక్టోబర్ 14 (పిసిడబ్ల్యూ న్యూస్): పరకాలలో బతుకమ్మ పండుగను ఎన్నడూ లేని విధంగా ఘనంగా నిర్వహించాలని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అధికారులకు సూచించారు. బుధవారం పరకాల పశువుల సంతలో బతుకమ్మ వేడుకల ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. మహిళా సోదరీమణులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. తాగునీరు, విద్యుత్, పారిశుధ్యం, భద్రత వంటి సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పండుగకు వచ్చే మహిళలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు.

Related Articles

Latest Articles