పరకాల, అక్టోబర్ 13 ( పిసిడబ్ల్యూ న్యూస్): పాత మున్సిపాలిటీ పరిధిలో అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియలో భాగంగా మంగళవారం కోగిలవాయి, సింగరాజుపల్లి, ల్యాదెళ్ల గ్రామాలకు చెందిన ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అర్హులైన మహిళా అభ్యర్థుల సర్టిఫికెట్లను అధికారులు పరిశీలించారు. అంగన్వాడీ పోస్టుల భర్తీ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించి, నిజమైన అర్హులకు న్యాయం చేయాలని అభ్యర్థులు కోరారు. ఎలాంటి అవకతవకలకు తావులేకుండా నిబంధనల ప్రకారం ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు.
