Friday, October 2, 2026

పరకాలలో అనుమానాస్పదంగా మహిళ మృతి

పరకాల, అక్టోబర్ 1 (పిసీడబ్ల్యూ న్యూస్): పరకాల పట్టణంలోని ఆకులవాడలో గురువారం అనుమానాస్పద ఘటన చోటుచేసుకుంది. కోడెల సుగుణక్క (63) అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందగా, ఆమె తల్లి కోడెల లక్ష్మమ్మ (85) తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. తీవ్రంగా గాయపడిన లక్ష్మమ్మను మెరుగైన వైద్యం కోసం హనుమకొండలోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. సుగుణక్క మృతికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటన ప్రమాదవశాత్తా జరిగిందా? మరేదైనా కారణం ఉందా? అనే కోణాల్లో విచారణ కొనసాగుతున్నట్లు సమాచారం.మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు ఘటనకు సంబంధించిన ఆధారాలను సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.

Related Articles

Latest Articles