పరకాల, మార్చి 8 (పిసిడబ్ల్యూ న్యూస్): అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పరకాల పోలీస్ స్టేషన్‌లో ఆదివారం వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా పోలీసు సిబ్బందిని అభినందిస్తూ వారి సేవలను అధికారులు ప్రశంసించారు. మహిళల సాధికారత, సమాజంలో వారి పాత్ర ఎంతో గొప్పదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పరకాల సీఐ కాంత్ కుమార్, ఎస్సై రమేష్, ఎస్సై పవన్ పాల్గొని మహిళా సిబ్బందికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. మహిళలు ప్రతి రంగంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
