Saturday, March 7, 2026

యువనేత విష్ణువర్ధన్ జన్మదిన వేడుకలకు ఎమ్మెల్యే ఆశీస్సులు..

పరకాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ యువజన శక్తి ఉత్సాహంగా ఉప్పొంగింది. శనివారం పరకాల కాంగ్రెస్ యువజన నాయకుడు మునిగంటి విష్ణువర్ధన్ పుట్టినరోజు సందర్భంగా పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి నివాసంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే, యువ నాయకుడు విష్ణువర్ధన్ ప్రజలకు మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు. పార్టీ అభివృద్ధి కోసం యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆశీస్సులు తీసుకున్న విష్ణువర్ధన్, పార్టీ పట్ల తన నిబద్ధతను పునరుద్ఘాటించారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో పరకాల కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దుప్పటి సాంబశివుడు, ఏఎంసీ మాజీ డైరెక్టర్ పసుల అన్నస్వామి, కాంగ్రెస్ నాయకులు దొమ్మటి బాపురావు, సుధామల్ల కిషోర్, గూడెల్లి కార్తీక్, ఎండీ సల్మాన్ తదితరులు పాల్గొని విష్ణువర్ధన్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

Related Articles

Latest Articles