పరకాల, జనవరి 17 (పిసిడబ్ల్యూ న్యూస్): పరకాల మున్సిపాలిటీ చైర్మన్ పదవి ఈసారి ఊహించని విధంగా జనరల్ రిజర్వేషన్‌గా ప్రకటించడంతో పట్టణ రాజకీయాల్లో చకచకలే నెలకొన్నాయి. గత ఎన్నికల్లో జాతి రిజర్వేషన్ ఉండటంతో కొన్ని వర్గాలకు మాత్రమే పోటీ అవకాశం లభించగా, ఈసారి జనరల్ రిజర్వేషన్ రావడంతో ప్రతి పార్టీ నుంచి ఆసక్తికరమైన సమీకరణలు మొదలయ్యాయి.
ప్రస్తుతం స్థానికంగా రెండు గుంపుల మధ్య “నువ్వా? నేనా?” అన్నట్టుగా పోటీ వేడి పెరిగింది. ప్రధాన పార్టీలకు చెందిన సీనియర్ నాయకులే కాదు, యువ నాయకులూ రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతుండటం విశేషం. బహిరంగంగా ప్రకటించకపోయినా, నేతల మధ్య అంతర్గత చర్చలు, తిరుగులు, తీర్మానాలు వేగంగా సాగే పరిస్థితి కనిపిస్తోంది.
సేవా కార్యక్రమాలు, ప్రజల్లో వ్యక్తిగత ఇమేజ్, పార్టీ ఆధిపత్యం… ఇవన్నీ కలిసి అభ్యర్థుల అవకాశాలను నిర్ణయించనున్నాయి. జనరల్ రిజర్వేషన్ కారణంగా పరకాల పట్టణంలో ఈసారి మున్సిపల్ చైర్మన్ పోరు మరింత ఉత్కంఠభరితంగా మారనుంది. ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడొస్తుందన్న ఆసక్తితో స్థానిక ప్రజలు, పార్టీ శ్రేణులు ఎదురు చూస్తున్నారు.
పరకాల మున్సిపల్ చైర్మన్ జనరల్ రిజర్వేషన్… నువ్వా నేనా పోటా పోటీ సిద్ధం అంటున్న ఆశావాహులు
