Saturday, July 25, 2026

రామడుగు మండల ఆటో యూనియన్ అధ్యక్షుడిగా చందా అనిల్ ఎన్నిక..

రామడుగు (పి సి డబ్ల్యూ న్యూస్ ) : రామడుగు మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఆటో జేఏసీ చైర్మన్ మంద రవికుమార్ ఆదేశాల అనుసారం కరీంనగర్ ఆటో కార్మిక సంక్షేమ సంఘం జెఏసి ఆధర్వంలో అధ్యక్షులు మందెల రాజేందర్ సమక్షంలో రామడుగు ఆటో మండల కమిటీ జేఏసీ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రామడుగు మండల అధ్యక్షుడు చందా అనిల్ మాట్లాడుతూ ఆటో యూనియన్ సమస్యలు ఉన్న ఎల్లవేళలా తోడుంటానని అందరితో కలిసి మెలిసి ఉంటానని అన్నారు. నా ఎన్నిక పట్ల రాష్ట్ర నాయకులకు జిల్లా నాయకులకు ఆటో యూనియన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. రామడుగు మండల అధ్యక్షుడిగా చందా అనిల్ ఉపాధ్యక్షులుగా తాళ్లపల్లి వెంకటేష్ గౌడ్ ఉపాధ్యక్షులుగా గుర్తురి శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శిగా అజీమ్ పాషా సహాయ కార్యదర్శిగా బత్తిని బాల కృష్ణగౌడ్ సహాయ కార్యదర్శిగా కత్తెరపాక కనకయ్య ప్రచార కార్యదర్శిగా చంటిబాబు ప్రచార కార్యదర్శిగా దయవల వెంకటేష్ కోశాధికారిగా ఎండి. సోహెల్ జిల్లా నాయకులు మండల నాయకులు జెఎసి ఆటో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.

Related Articles

Latest Articles