PCW News

Breaking
పురుగుల మందు తాగి వ్యక్తి మృతి *ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి*. రామడుగు పోలీస్ స్టేషన్ ను సందర్శించిన కరీంనగర్ పోలీస్ కమీషనర్ జర్నలిస్టులకు మొండి చేయి చూపిన కాంగ్రెస్ ప్రభుత్వం -నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ అప్రజాస్వామికం -మాలమహానాడు జిల్లా కార్యదర్శి కూనమళ్ళ కమలాకర్ జీడీఎస్‌ల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాలి.. ప్రతి మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం.. ఆనందోత్సాహాల నడుమ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. భూ కబ్జాదారుల నుండి 41 ఏళ్ల సమస్య.. రహదారుల పైన మత పరమయిన నిర్మాణాలు తొలగించాల్సిందే

పెండింగ్ బిల్లులపై సర్పంచులకు తప్పని అప్పుల తిప్పలు..

గత ప్రభుత్వ వైఖరే కారణమంటోన్న అధికార పార్టీ 90శాతం బీఆర్‌ఎస్‌ మద్దతుదారులే ఉండడంతో దిక్కుతోచని స్థితి దాదాపు రెండేళ్లుగా విడుదల కాని రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు నాలుగు నెలలుగా 15వ ఆర్థిక సంఘం నిధులూ పెండింగ్‌లోనే రెండేళ్ల నుంచి క్లియర్‌కాని ఉపాధి పథకం పనుల బిల్లులు ప్రతీ పంచాయతీలో రూ.10లక్షల నుంచి రూ.కోటి వరకు పెండింగ్‌ మరో పది రోజుల్లో ముగియనున్న పాలకవర్గాల గడువు బిల్లులపై ఆందోళనలో సర్పంచులు. నడికూడా ప్రతినిధి: పంచాయతీల నిధులు రాక ప్రజాప్రతినిధులు పరేషాన్‌లో ఉన్నారు. దీనికితోడు రాజకీయ రంగప్రవేశం వారిని కుంగదీస్తోంది. అసలే పాలన గడువు ముగియనుండడంతో పెండింగ్‌ బిల్లుల పరిస్థితి ఏమిటన్నది మరింత ఆందోళన రేకెత్తిస్తోంది. ప్రస్తుత అధికార పార్టీ వారు గత ప్రభుత్వ వైఖరి వల్లే ఈ దుస్థితికి కారణమంటుండగా, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ వారు మాత్రం పెండింగ్‌ బిల్లులు ఇచ్చేదాకా పోరాటం చేస్తామంటుండడం గమనార్హం. చిన్న పంచాయతీ మొదలుకొని పెద్ద పంచాయతీల్లో రూ.10 లక్షల నుంచి రూ. కోటి దాకా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయంటే పరిస్థితి ఎలా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. ఒకపక్క పెండింగ్‌ బిల్లుల రాక.. మరోపక్క పాలన గడువు రోజుల వ్యవధిలో తీరిపోనుండటం.. ఇంకోపక్క రాజకీయం చోటుచేసుకుంటుండటంతో సర్పంచ్‌ల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. గ్రామపంచాయతీల పెండింగ్‌ బిల్లు లపై రాజకీయం రగులు తోంది. సర్పంచ్‌ సహా పాలకవర్గాల గడువు మరో పది రోజుల్లో ముగియనుం డడం, ఈలోపు పెండింగ్‌ బిల్లులు వచ్చే పరిస్థితి క నిపించకపోవడంతో సర్పంచు ల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ దుస్థితికి గత ప్రభు త్వ వైఖరే కారణమని అధికార పార్టీ నేతలు ప్ర కటిస్తుంటే, బిల్లులివ్వకపోతే ఆందోళనలు చేస్తామని ప్రతిపక్ష బీ ఆర్‌ఎస్‌ పేర్కొనడం పెండింగ్‌ బి ల్లులపై జరగబోయే రాజకీయాన్ని సూచిస్తోంది. సర్పంచులలో 90 శాతం పైగా బీఆర్‌ఎస్‌కు చెందినవారే ఉండడం తో, పార్టీ అధికారంలో ఉన్న సమయంలో బిల్లుల కోసం నిలదీయలేకపోయామని ఇప్పుడు సర్పంచులు లోలోన మథనపడుతున్న పరిస్థితి నెల కొంది. చిన్నపంచాయతీ మొదలుకొని పెద్ద పంచాయ తీల వరకు రూ.10లక్షల నుంచి రూ. కోటి వరకు బిల్లులు పెండింగ్‌ పడడం, దాదాపు రెండేళ్లుగా రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు జమకాకపోవడం, గత నాలుగు మాసాలుగా కేంద్ర ఆర్థిక సంఘం నిధులు రాకపోవడం, ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌ కిం ద చేపట్టిన పనులకూ బిల్లులు రాకపోవడం, మరోవైపు పాలక వర్గ గడువు ముగియనుండడంతో సర్పంచుల పరిస్థితి కక్కలేక మింగలేక అన్నట్లుగా తయారైంది. రూ.10లక్షల నుంచి రూ.కోటి వరకు పెండింగ్‌ బిల్లులు నడికూడ మండలల్లోని12 గ్రామపంచాయతీల్లో దాదాపు అన్ని పంచాయతీల్లో పెద్ద ఎత్తున చేసిన పనులకు బిల్లులు పెం డింగ్‌లో ఉన్నాయి. సీసీరోడ్లు, వైకుంఠధామాలు, మట్టిరోడ్లు, డ్రైనేజీల పనులకు సంబంధించిన బిల్లులు దాదాపు రెండేళ్ల నుంచి రావడం లేదు.