టీబీ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహారం పంపిణీ. ఆత్మకూరు పి ఎసి ఎస్ చైర్మన్ ఏరుకొండ రజిని రవీందర్ గౌడ్..
ఆత్మకూర్: టీబీ వ్యాధిగ్రస్తులకు ప్రతి నెల పౌష్టికాహారాన్ని టీవీ మిత్ర కార్యక్రమంలో భాగంగా ఆత్మకూరు మండల కేంద్రంలో శుక్రవారం పౌష్టికాహారాన్ని అందించిన దాతలు పిఎసిఎస్ చైర్మన్ ఏరుకొండ రజిని రవీందర్ గౌడ్ల చేతుల మీదుగా గ్రామంలో అందజేశారు. జాతీయ ఆరోగ్య మిషన్ టిబి ముక్తభారత్ కార్యక్రమం గ్రామపంచాయతీ ఆవరణలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏరుకొండ రజిని రవీందర్ గౌడ్ న్యూట్రిషన్ కిట్లను వ్యాధిగ్రస్తులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో టీబి ల్యాబ్ టెక్నీషియన్ సూపర్వైజర్ వంగాల రాజేంద్రప్రసాద్, ఎంఎల్ హెచ్ పి వైద్యులు నరసింహారావు, నరసమ్మ, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.