వనభోజనాలకు హాజరైన ఎమ్మేల్యే చల్లా..
పరకాల పట్టణ కేంద్రంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్తీకమాస వనభోజన కార్యక్రమంలో పరకాల శాసనసభ్యులు *చల్లా ధర్మారెడ్డి గారు* హాజరయ్యారు. ఆర్యవైశ్య సంఘం సభ్యులు ఆర్యవైశ్య కమ్యూనిటీ హాల్ కావాలని కోరగా ఎమ్మెల్యే గారు ఆర్యవైశ్య సంఘం భవన నిర్మాణానికి నిధులు మంజురు చేస్తానని హామీ ఇచ్చారు.భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే గారికి ఆర్యవైశ్య సంఘ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ ముఖ్య నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.