పాముకాటుకు మహిళ మృతి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందజేసిన మాజీ జెడ్పీటీసీ ద్రోణవల్లి సతీష్.
తెలంగాణ/కామారెడ్డి-బీర్కూర్ పిసీడబ్ల్యూ న్యూస్ ప్రతినిధి..
కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో ఉపాధి హామీ పని కోసం వెళ్లి ఎల్లమ్మ గుట్టకు కందకాలు తవ్వుతున్నప్పుడు ఎరుకల యాదమ్మ( 43) అనే మహిళ పాము కాటుకు గురై చనిపోయింది. ఈ విషయం తెలుసుకున్న మాజీ జెడ్పిటిసి ద్రోణవల్లి సతీష్ యాదమ్మ ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులకు పరామర్శించి అంత్యక్రియలకు 10000 రూపాయలు ఆర్థిక సహాయం అందచేశారు. అలాగే ప్రభుత్వం నుండి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రఘు, రైతు బందు అద్యక్షుడు ఆవారి గంగారాం, ఎంపీటీసీ సందీప్, కొరిమే రఘు తదితర నాయకులు పాల్గొన్నారు.