తెలంగాణలో జర్నలిస్టులకు ఇంటి స్థలాల కల్పనపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శుభవార్త తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అర్హులైన జర్నలిస్టులకు ఇంటి స్థలాల విషయంలో సానుకూల నిర్ణయం తీసుకునే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని వెల్లడించారు. దీంతో ఇళ్ల స్థలాల కోసం ఎదురుచూస్తున్న జర్నలిస్టుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
