పరకాల, అక్టోబర్ 23 (పిసిడబ్ల్యూ న్యూస్): పట్టణంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై నిఘా పెట్టి, రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా తనిఖీలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో పరకాల ఎస్సై పవన్‌తో పాటు పోలీసు కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రాణాపాయం ఏర్పడటమే కాకుండా, ఇతరుల ప్రాణాలకూ ముప్పు వాటిల్లుతుందని పోలీసులు హెచ్చరించారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ, సురక్షిత ప్రయాణానికి సహకరించాలని సూచించారు.
