Monday, October 19, 2026

పరకాలలో పోలీసుల చాకచక్యం.. బాధితుడికి మొబైల్ ఫోన్ అప్పగింత!

పరకాల అక్టోబర్ 18, (పీసీడబ్ల్యూ న్యూస్): పరకాల పట్టణంలోని ఓ పెట్రోల్ బంకు వద్ద పోగొట్టుకున్న మొబైల్ ఫోన్‌ను పోలీసులు చాకచక్యంగా గుర్తించి బాధితుడికి తిరిగి అప్పగించారు. పెట్రోల్ పోయించుకుని వెళ్తుండగా బాధితుడి జేబులో నుంచి మొబైల్ జారిపడింది. గుర్తుతెలియని వ్యక్తులు దానిని తీసుకెళ్లడంతో బాధితుడు వెంటనే పరకాల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. స్పందించిన పోలీసులు తెలివిగా దర్యాప్తు చేసి మొబైల్‌ను గుర్తించి బాధితుడికి అందజేశారు. పోలీసుల చొరవపై బాధితుడు హర్షం వ్యక్తం చేశారు.

Related Articles

Latest Articles