Saturday, October 17, 2026

తులం బంగారం హామీ ఏమైంది? సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే రేవూరిని ప్రశ్నించిన చల్లా ధర్మారెడ్డి

పరకాల, అక్టోబర్ 16, (పీసీడబ్ల్యూ న్యూస్): కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద లక్ష రూపాయల చెక్కుతో పాటు తులం బంగారం ఇస్తామని ఇచ్చిన హామీ ఏమైందని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రశ్నించారు. పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు పెద్దన్నలా అండగా ఉంటామని చెప్పి, హామీని అమలు చేయకపోవడం నమ్మకద్రోహమని విమర్శించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని పాలన ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొంటూ సీఎం రేవంత్ రెడ్డి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

Related Articles

Latest Articles