Saturday, October 17, 2026

డివైడర్‌లో గడ్డి తొలగించరా? అధికారుల నిర్లక్ష్యంతో ప్రమాదాల ముప్పు

నడికూడ, అక్టోబర్ 16 (పీసీడబ్ల్యూ న్యూస్): పరకాల–హుజూరాబాద్ ప్రధాన రహదారిపై డివైడర్ మధ్యలో గడ్డి ఏపుగా పెరిగి వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తోంది. నడికూడ, పరకాల పరిధిలో గడ్డి పెరగడంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. డివైడర్‌లో నాటిన మొక్కలు సైతం గడ్డి మధ్య కనుమరుగయ్యాయి. సంబంధిత అధికారులు స్పందించకపోవడంపై వాహనదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు తక్షణమే స్పందించి గడ్డిని తొలగించి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Related Articles

Latest Articles