Wednesday, October 14, 2026

పరకాల ఆర్డీఓ కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

పరకాల,  అక్టోబర్ 13 (పిసిడబ్ల్యూ న్యూస్): పరకాల ఆర్డీఓ కార్యాలయంలో తొలిసారిగా బతుకమ్మ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పోటీల్లో ఆత్మకూరు మండలం మొదటి బహుమతి, పరకాల ఆర్డీఓ కార్యాలయం రెండో బహుమతి, నడికూడ మండలం మూడో బహుమతి సాధించాయి. కార్యక్రమంలో పలువురు తహసీల్దార్లు (ఎమ్మార్వోలు), అధికారులు పాల్గొని బతుకమ్మ సంబరాలను ఉత్సాహంగా జరుపుకున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను అధికారులంతా కలిసి ఘనంగా నిర్వహించడంతో కార్యాలయ ప్రాంగణంలో పండుగ సందడి నెలకొంది.

Related Articles

Latest Articles