Wednesday, October 14, 2026

కరెంట్ అధికారుల నిర్లక్ష్యం.. ప్రమాదం పొంచి ఉన్నా పట్టించుకోరా?

నడికూడ, అక్టోబర్ 13 (పిసిడబ్ల్యూ న్యూస్) : నడికూడ మండల కేంద్రంలోని గొల్లవాడలో విద్యుత్‌ స్తంభంపై ఎండిపోయిన తీగ ప్రమాదకరంగా మారుతోందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఈ సమస్య కనిపించడం లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు. విద్యుత్‌ ప్రమాదం జరిగి ప్రాణనష్టం సంభవించకముందే సంబంధిత అధికారులు స్పందించి, ఎండిపోయిన తీగను తొలగించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇప్పటికైనా విద్యుత్‌ శాఖ అధికారులు నిర్లక్ష్యాన్ని వీడి తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత స్పందిస్తారా.. ముందే మేల్కొంటారా? అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

Related Articles

Latest Articles