పరకాల, అక్టోబర్ 06 (పిసిడబ్ల్యూ న్యూస్): పరకాల TGSRTC యూనియన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా TWU, SWF ఐక్య కూటమి అభ్యర్థుల తరఫున పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్‌రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా RTC కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ.. కార్మికుల హక్కులు, సంక్షేమం కోసం నిరంతరం పోరాడుతున్న ఐక్య కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు.బాణం గుర్తుకు ఓటు వేసి ఐక్య కూటమి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని RTC కార్మికులకు ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి ఐక్యంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు.ఈ ప్రచార కార్యక్రమంలో ఐక్య కూటమి నాయకులు, RTC కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
