Tuesday, September 29, 2026

ఉప్పులపల్లెలో దారుణ హత్య.. కత్తితో పొడిచి వ్యక్తి హతం

కమలాపూర్, సెప్టెంబర్ 28 (పిసిడబ్ల్యూ న్యూస్): హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పులపల్లె గ్రామానికి చెందిన వడిగే రాకేష్ దారుణ హత్యకు గురయ్యాడు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండల పరిధిలోని పెద్దపాపయ్యపల్లె సమీపంలోని ఎస్సారెస్పీ కెనాల్ వద్ద సోమవారం ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. ఉప్పులపల్లెకు చెందిన ప్రశాంత్ అనే వ్యక్తి రాకేష్‌పై కత్తితో దాడి చేసినట్లు తెలుస్తోంది. తీవ్ర గాయాలతో రాకేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. హత్యకు పాత కక్షలే కారణమని ప్రాథమికంగా తెలుస్తున్నప్పటికీ, అసలు కారణాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. హత్య అనంతరం నిందితుడు ప్రశాంత్ కమలాపూర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయినట్లు సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హత్యకు దారితీసిన పరిస్థితులు, నిందితుడి పాత్ర, పాత కక్షలకు సంబంధించిన వివరాలను పోలీసులు విచారిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తు అనంతరం వెల్లడికానున్నాయి.

Related Articles

Latest Articles