Monday, September 28, 2026

పరకాలలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు

పరకాల, సెప్టెంబర్ 27 (పిసిడబ్ల్యూ న్యూస్): కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకుని పరకాల–హుజూరాబాద్ ప్రధాన రహదారిపై ఉన్న ఆయన విగ్రహానికి పద్మశాలి కులబాంధవులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాపూజీ సేవలను స్మరించుకుంటూ ఆయన ఆశయాలను కొనసాగించాలని పలువురు పేర్కొన్నారు. కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు మెండు రవీందర్ మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. తెలంగాణ సమాజం కోసం ఆయన చేసిన పోరాటం, ప్రజా సేవలు చిరస్మరణీయమని అన్నారు. సామాజిక న్యాయం, సమాజ అభ్యున్నతి కోసం బాపూజీ చేసిన కృషి నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. తెలంగాణ కోసం ఆయన చేసిన త్యాగాలు, సేవలను భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. బాపూజీ ఆశయాల సాధనకు సమాజంలోని ప్రతి ఒక్కరూ ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అనంతరం పద్మశాలి కులబాంధవులు బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో పద్మశాలి సంఘం నాయకులు, కులబాంధవులు, స్థానికులు పాల్గొన్నారు.

Related Articles

Latest Articles