Monday, September 28, 2026

బస్‌స్టేషన్‌లో 24 గంటల విచారణ సేవలు

పరకాల, సెప్టెంబర్ 27 (పిసిడబ్ల్యూ న్యూస్): ప్రయాణికుల సౌకర్యార్థం పరకాల బస్‌స్టేషన్‌లో 24 గంటలపాటు విచారణ సేవలు అందుబాటులో ఉన్నాయని పరకాల ఆర్టీసీ డిపో మేనేజర్‌ టి. శ్రీనివాసులు తెలిపారు. బస్‌స్టేషన్‌కు వచ్చే ప్రయాణికులు బస్సుల రాకపోకలు, వివిధ ప్రాంతాలకు వెళ్లే సర్వీసుల వివరాలను ఎప్పుడైనా విచారణ కేంద్రం ద్వారా తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. ప్రయాణికులు బస్సుల సమయాలు, గమ్యస్థానాలకు వెళ్లే సర్వీసుల వివరాల కోసం 7382926174 నంబర్‌ను సంప్రదించాలని డిపో మేనేజర్‌ సూచించారు. ప్రయాణికులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన రవాణా సేవలు అందించేందుకు ఆర్టీసీ సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉంటారని తెలిపారు. ప్రయాణికులు ఈ విచారణ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

Related Articles

Latest Articles