Saturday, September 26, 2026

వంద పడకల ఆసుపత్రిలో రేపటి నుంచి ఓపీ సేవలు

పరకాల, సెప్టెంబర్ 25 (పిసిడబ్ల్యూ న్యూస్): పరకాల పట్టణంలోని వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం (26.09.2026) నుంచి ఓపీ (ఔట్ పేషెంట్) సేవలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు శుక్రవారం పరకాల రెవెన్యూ డివిజనల్ అధికారి ఆసుపత్రిని పరిశీలించారు. ఓపీ సేవలు ప్రారంభించేందుకు ఆసుపత్రిలో చేపట్టిన ఏర్పాట్లను ఆర్డీవో పరిశీలించి, సేవలు సజావుగా కొనసాగేందుకు వైద్యులు, ఆసుపత్రి సిబ్బందికి పలు సూచనలు, సలహాలు అందజేశారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. పరకాల రెవెన్యూ డివిజన్ పరిధిలోని ప్రజలు ఈ విషయాన్ని గమనించి, రేపటి నుంచి వంద పడకల ఆసుపత్రిలో అందుబాటులోకి రానున్న ఓపీ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్ టి. విజయలక్ష్మి, వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Latest Articles