పరకాల, సెప్టెంబర్ 24 (పీసడబ్ల్యూ న్యూస్): పరకాల పట్టణంలోని బందర్ రోడ్డు నుంచి రాయపర్తి వైపు బైక్‌పై వెళ్తున్న రాయపర్తికి చెందిన చాంద్ పాషా (45)ను మలక్పేట కమాన్ సమీపంలో వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొట్టింది. ప్రమాదం తీవ్రతకు బైక్‌పై ఉన్న చాంద్ పాషా రోడ్డుపై పడిపోగా, కాలికి, తలకు, ఛాతీ భాగంలో తీవ్ర గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. వెంటనే స్థానికులు అతడిని పరకాల ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం వరంగల్‌కు తరలించారు. ప్రమాదానికి అతివేగమే కారణమని స్థానికులు చెబుతున్నారు. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
