పిసిడబ్ల్యూ న్యూస్ క్రైమ్ ప్రత్యేక ప్రతినిధి: పరకాల పట్టణంలో విలేకరిపై దాడికి సంబంధించిన ఘటనలో పరకాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నాలుగు రోజుల క్రితం జరిగినట్లు పేర్కొంటున్న ఈ ఘటనపై ఫిర్యాదు అందడంతో పోలీసులు చట్టపరమైన చర్యలు ప్రారంభించినట్లు సమాచారం. ఈ సందర్భంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలను ఉపేక్షించేది లేదని పరకాల పోలీసులు స్పష్టం చేశారు. విలేకరిపై దాడి ఘటనకు సంబంధించి కేసు నమోదు కావడంతో పాటు, నిందితుడికి మరో విలేకరి జామిన్ ప్రక్రియలో భాగంగా పోలీస్ స్టేషన్‌కు వచ్చిన వ్యక్తిని పోలీసులు నిబంధనల ప్రకారం వెనక్కి పంపినట్లు తెలిసింది. కేసు దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో చట్టపరమైన ప్రక్రియకు ఎలాంటి ఆటంకం కలగకుండా పోలీసులు వ్యవహరిస్తున్నట్లు సమాచారం. పరకాల పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు ప్రాధాన్యం ఇస్తున్నారని ఈ ఘటన మరోసారి స్పష్టం చేస్తోంది. ఎవరైనా బెదిరింపులు, దాడులు, గొడవలు లేదా ప్రజలకు ఇబ్బంది కలిగించే చర్యలకు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. వ్యక్తి ఎవరైనా, ఏ వర్గానికి చెందిన వారైనా చట్టాన్ని అతిక్రమిస్తే ఉపేక్షించబోమని పోలీసులు స్పష్టం చేసినట్లు సమాచారం. ప్రత్యేకంగా జర్నలిస్టులపై దాడులు, బెదిరింపులు వంటి ఘటనలను పోలీసులు సీరియస్‌గా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రజాస్వామ్యంలో పాత్రికేయులు తమ విధులను స్వేచ్ఛగా నిర్వహించేందుకు శాంతియుత వాతావరణం అవసరమని, అందుకు భంగం కలిగించే చర్యలను చట్టపరంగా ఎదుర్కొంటామని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. పరకాల పోలీసుల తాజా చర్యలతో పట్టణంలో శాంతిభద్రతల విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారనే సంకేతం వెలువడింది. రౌడీయిజం, బెదిరింపులు, దాడులు వంటి చర్యలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు తేల్చిచెప్పారు. ప్రజలు కూడా ఎలాంటి సమస్యలు ఎదురైనా నేరుగా పోలీసులను ఆశ్రయించాలని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకుండా పోలీసులకు సమాచారం అందించాలని సూచిస్తున్నారు. శాంతిభద్రతల పరిరక్షణే ప్రధాన లక్ష్యంగా పరకాల పోలీసులు ముందుకు సాగుతున్నారని, పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తామని పోలీసులు పేర్కొంటున్నారు. ప్రజలు కూడా పోలీసులను చట్టాలను ఎక్కువగా పరకాల పట్టణంలో నమ్ముతున్నారు.
